
న్యూస్

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ విషయాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన స్వర్ణ గతంలో వరంగల్ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సునీత రావు స్థానంలో ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, మహిళా కార్యకర్తలను సమీకరించడం లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!