
గాసిప్స్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విస్తృతంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు, ఇప్పుడు కీలక రాజకీయ నేతలపై దృష్టి సారించినట్లు సమాచారం.
లిక్కర్ పాలసీ అమలు సమయంలో భారీ స్థాయిలో అక్రమ లావాదేవీలు, హవాలా మార్గంలో నిధుల చలామణి, మనీ లాండరింగ్ జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ఆయన పాత్రపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాల ఆధారంగా ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!