
.png&w=3840&q=75)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో తల పండిన వారు దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల పై దాటిన రాజకీయ ఆయనది. పాతికేళ్ల వయసులో రాజకీయం మొదలెట్టి ఏడు పదుల వయసులోనూ నాట్ ఔట్ అంటూ ముందుకు సాగుతున్నారు. మాటకు మాట పంచ్ కి పంచ్ అన్నట్లుగా అయ్యన్న రాజకీయం సాగుతుంది. ఆయన చాలా సార్లు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. ఒక్కోసారి అధికార పక్షానికి ఇబ్బంది వచ్చినా ఆయన తన ధోరణిలో తాను వెళ్తారని ఆయనది కరెక్ట్ కూడా అని అంటారు.
లేటెస్ట్ గా చూస్తే అయ్యన్నపాత్రుడు ఒక విషయంలో వైసీపీ అధినేత జగన్ కి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గత ఏడాదిన్నరగా హాజరు కావడం లేదు, వారి మీద చర్యలకు స్పీకర్ చూస్తున్నారు. ఇది అనేక సందర్భాలలో ఆయన చెప్పారు కూడా. జీతాలు తీసుకుంటూ సభకు రాకుండా ఉంటే ఎలా అని అది సమంజసమేనా అని కూడా ఆయన ప్రశ్నించారు. జీతాలు తీసుకుని ఉద్యోగులు పనిచేయకపోతే చర్యలు ఉంటాయి కదా అలాగే జీతాలు తీసుకుంటూ సభకు రాని ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి ఒక్క జగన్ తప్ప అందరి ఎమ్మెల్యేలు జీతాలు పుచ్చుకుంటున్నారు అని అసలు విషయాన్ని అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. జగన్ ని తప్పించి మిగిలిన వారు సభకు రాకుండా జీతాలు పుచ్చుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని మీద తాము నిబంధనలు పరిశీలిస్తున్నామని చర్యలకు కూడా చూస్తున్నామని చెప్పారు.
అయితే అయ్యన్న జగన్ కి క్లీన్ చీట్ ఇస్తూ ఆయన జీతాలు తీసుకోవడం లేదని చెప్పడం మాత్రం కూటమికి కొంత ఇబ్బంది కలిగించేదిగా ఉందని అంటున్నారు. జగన్ సభకు రావడం లేదని కూటమి ఎమ్మెల్యేలు నాయకులు తరచూ విమర్శలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జీతాలు పుచ్చుకుని అసెంబ్లీకి మాత్రం దూరం అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ జాబితాలో జగన్ లేకపోయినా ఆయనను కూడా కలిపి విమర్శిస్తున్నారు. ఆ విధంగా రాజకీయంగా ఈ విమర్శలకు విలువ పెరుగుతోంది. అయితే జగన్ కాకుండా మిగిలిన వారే జీతాలు తీసుకుంటున్నారు అని స్వయంగా స్పీకరే వివరణ ఇచ్చి చెప్పడంతో ఈ ఆరోపణలలో పస ఉండదని అంటున్నారు. అయ్యన్న అయితే ఉన్నది ఉన్నట్లుగా చెప్పారని ఇక మీదట జగన్ విషయంలో విమర్శలు చేసే వీలు లేకుండానే చేశారని అంటున్నారు.






.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!