
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మరియు కాంగ్రెస్ మళ్లీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీట్ల పంపకాలలో భాగంగా కాంగ్రెస్కు 28 అసెంబ్లీ సీట్లు మరియు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీట్ల పంపకాల అంశంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ చర్చల ద్వారా రెండు పార్టీల మధ్య కూటమి కొనసాగించే విషయంపై స్పష్టత వచ్చినట్టు సమాచారం.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొదటగా కాంగ్రెస్ 30 సీట్లకు తగ్గేది లేదని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను డీఎంకేతో చర్చలు జరిపే బాధ్యతగా పార్టీ అధిష్ఠానం నియమించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!