
సినిమాలు

నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆందోళనకారులు కోరారు.
సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) పిలుపునిచ్చిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!