
సినిమాలు

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU)లో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి నిర్వహించిన తీజ్ వేడుకల సందర్భంగా ఓ విద్యార్థిపై దాడి జరగడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. అనంతరం ఈ వివాదం మంజీరా హాస్టల్ ప్రాంగణంలో పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది.
ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు జేఎన్‌టీయూ ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థులు జేఎన్‌టీయూ ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!