

కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘అరసన్’. వెట్రిమారన్ సృష్టించిన ‘వడ చెన్నై’ యూనివర్స్ నేపథ్యంలో ఈ సినిమాను స్టాండ్‌అలోన్ గ్యాంగ్‌స్టర్ కథగా రూపొందిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఆండ్రియా జెర్మియా కథానాయికలుగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న శింబు ‘అరసన్’పై కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని, తన పాత్ర యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు సాగుతుందని తెలిపారు. కథకు అనుగుణంగా 5 నుంచి 6 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూడు గెటప్‌లకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. వెట్రిమారన్ నాణ్యత, వాస్తవికతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో షూటింగ్‌కు సమయం పడుతోందని శింబు తెలిపారు. ఈ సినిమా 2027 పొంగల్‌కు విడుదల కావడం లేదని స్పష్టం చేస్తూ, అభిమానులను గర్వపడేలా చేసే చిత్రాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో ప్రత్యేకమైన ‘వరల్డ్ ఆఫ్ అరసన్’ కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!