

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు దాదాపు ముగిశాయి. తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన కొత్త ప్రోమో ఆసక్తిని పెంచుతోంది. వైవిధ్యం, డ్రామా, ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, భావోద్వేగాలతో ఈ సీజన్ సాగనుందని ప్రోమో ద్వారా తెలుస్తోంది. ప్రేక్షకులకు గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అందించడంతో పాటు పది రెట్లు ఎక్కువ సర్‌ప్రైజ్‌లు, ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయని మేకర్స్ హామీ ఇచ్చారు. ఈ సీజన్‌కు దశావతారం థీమ్‌ను ఎంచుకున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌ను ఈ నెల 6న రాత్రి 7 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. యాంకర్ వర్షిణి, నటులు కృష్ణుడు, ఆదిత్స్ అరుణ్, యాంకర్ సుధీర్ బాబు, కమెడియన్ రామ్ ప్రసాద్ పేర్లు సంభావ్య కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే విషయం గ్రాండ్ ప్రీమియర్‌లో వెల్లడికానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!