4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

Writer: Chandrika 10:37 AM, 4 సెప్టెంబర్, 2026
చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన విద్యాభ్యాసం, సినీ కెరీర్‌, పాత్రల ఎంపికపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చదువును పూర్తి చేయకుండా నటనను కెరీర్‌గా ఎంచుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపం ఉందని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ప్రస్తుతం వెండితెరతో పాటు ఓటీటీలోనూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు. కరీనా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దాయారా’ చిత్రానికి మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కరీనా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. 11వ తరగతి తర్వాత చదువును కొనసాగించకుండా నటన వైపు వచ్చినట్లు చెప్పారు. నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన అనుభవం కారణంగానే పిల్లలు ముందుగా చదువు పూర్తి చేసి, ఆ తర్వాత తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వడానికి యూనిసెఫ్‌ తనను సంప్రదించినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, చదువు పూర్తి చేయలేదనే బాధ ఇప్పటికీ తనలో ఉందని వెల్లడించారు.

సినిమాలను వాటి బాక్సాఫీస్‌ విజయావకాశాల ఆధారంగా ప్రచారం చేయడం తనకు విసుగు కలిగిస్తుందని కరీనా అన్నారు. అలాగే తన వయసు ఆధారంగా పాత్రలు నిర్ణయించబడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. 75 ఏళ్ల వయసులోనూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషించాలని ఉందని తెలిపారు. సినిమాల ఎంపికలో బలమైన కథలు, ప్రతిభావంతులైన దర్శకులను ఎంచుకోవడమే తనకు ముఖ్యమని చెప్పారు. తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించేలా, తనను సవాలు చేసే కథల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తనను ఎక్కువగా హాస్యభరితమైన, తేలికపాటి వినోదాత్మక చిత్రాల్లో చూడాలని కోరుకుంటారని తెలిసినా, ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదన్నారు. ఒక నటిగా ఎప్పుడూ విభిన్నమైన పాత్రలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని, అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నానని కరీనా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

ట్యాగ్లు
కరీనా కపూర్‌కరీనా కపూర్‌ ఇంటర్వ్యూబాలీవుడ్‌ నటికరీనా కపూర్‌ సినిమాలుదాయారాపృథ్వీరాజ్‌ సుకుమారన్‌మేఘనా గుల్జార్‌బాలికల విద్యబాలీవుడ్‌ వార్తలుఓటీటీ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!