
న్యూస్

పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరిపై ఈ నెల 12 న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరిపై శాసనసభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ ఇప్పటికే విచారణ ప్రక్రియను పూర్తిచేసినట్లు సమాచారం.
సుప్రీం కోర్టులో విచారణ జరగకముందే ఈ ఇద్దరిపై తీర్పును ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకరిపై రేపు, మరొకరిపై ఎల్లుండి వేర్వేరుగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇదివరకు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు శాసనసభాధ్యక్షుడు నిర్దోషిత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చే తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!