

తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 79.15 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం ఈ విధంగా నమోదైంది:
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 87.93% ఓటింగ్ జరిగింది.
మెదక్ జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది.
వరంగల్ జిల్లాలో 81.2% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు.
ములుగు జిల్లాలో 73.57%,
హనుమకొండలో 75.6%,
జనగాంలో 71.96% పోలింగ్ నమోదైంది.
సూర్యాపేట జిల్లాలో 87.77% ఓటింగ్ జరిగింది.
నల్గొండ జిల్లాలో 81.63% పోలింగ్ నమోదైంది.
నిర్మల్ జిల్లాలో 79.81% ఓటర్లు ఓటేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 69.10% ఓటింగ్ జరిగింది.
మంచిర్యాల జిల్లాలో 77.34% పోలింగ్ నమోదైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!