

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన విజనరీ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ పబ్లికేషన్ అయిన బ్లూమ్‌బర్గ్ తమ వీడియో స్టోరిలో చంద్రబాబును ప్రత్యేకంగా ఫీచర్ చేసింది. సాధారణంగా బ్లూమ్‌బర్గ్ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు వంటి ప్రపంచ నాయకులతోనే ఇంటరాక్ట్ చేస్తుంది. అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడటం, ఏపీ గ్లోబల్ స్థాయిలో ఎంత ప్రాధాన్యం సంతరించుకుంటోందో చూపిస్తోంది. ఈ చర్చ ప్రధానంగా గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతున్న డేటా సెంటర్ పెట్టుబడి చుట్టూ జరిగినది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ విప్లవానికి మరొక కొత్త అధ్యాయం అని, ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమేనని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత తన తదుపరి దృష్టి క్వాంటం కంప్యూటింగ్‌పై ఉందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం కంప్యూటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. బ్లూమ్‌బర్గ్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై చేసిన ఈ ప్రకటన, ఏపీని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌పై మరింతగా నిలబెట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!