

కర్ణాటకలో నాయకత్వ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. గురువారం సహచర మంత్రులతో సమావేశం అనంతరం బెంగళూరులో గవర్నర్‌కు రాజీనామా సమర్పించే అవకాశముందని సమాచారం. ఈ పరిణామాల మధ్య దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో రాష్ట్ర నేతలతో కీలక చర్చలు జరిపింది.
సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానంతో పాటు కీలక బాధ్యతలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రి అవకాశం ఇవ్వవచ్చని సమాచారం. అయితే, సీఎం పదవి అహింద వర్గాలకు ఇవ్వాలని సిద్ధరామయ్య సూచించినట్లు తెలిసింది, దీంతో డాక్టర్ జి. పరమేశ్వర్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డీకే శివకుమార్ తనకు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య ఈ వార్తలను ఖండిస్తూ, చర్చలు కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!