

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై రాష్ట్ర బీజేపీ విభాగం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసు జారీ చేసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు నగదు, మంత్రి పదవులు ఆఫర్ చేశారంటూ ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని బీజేపీ పేర్కొంది. ఏడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేసింది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ మాట్లాడుతూ, ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలకు రూ.30 కోట్లు, మంత్రి పదవులు, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఆఫర్లు ఇచ్చి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండిస్తూ, వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!