

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిత్యహారతి దర్శనం కల్పించాలని కోరడం సరికాదని ఆయన అన్నారు. నిత్యహారతి దర్శనం అనేది మైసూరు మహారాజుకు సంప్రదాయంగా అందించే ప్రత్యేక గౌరవమని, దాన్ని రాజకీయ నాయకులకు వర్తింపజేయడం తగదని స్పష్టం చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను రాజకీయ వేదికగా మార్చకూడదని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయ సంప్రదాయాలను ఉపయోగించవద్దని సూచించారు. ఒక రాష్ట్రానికి అవకాశం ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయని, టీటీడీ ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదని చెప్పారు. డీకే శివకుమార్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని రేపు జరగనున్న ధార్మిక పరిషత్ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!