
గాసిప్స్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఇటీవల జగన్ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన లేఖలో కోరారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రజల్లో విస్తృత మద్దతు ఉన్న నేతగా జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని తలశిల రఘురాం కేంద్ర హోం శాఖను కోరారు. భవిష్యత్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!