
జనరల్

సోమవారం శాసనసభ ఎదుట చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీకి రాగానే నేరుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్‌ను పరామర్శించి, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం, అధికారులతో ఘర్షణకు దిగినట్లు వచ్చిన వార్తలు, టీవీ ప్రసారాలను సీఎం గమనించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సీఎం ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్‌ను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌కు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!