

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేకపోయిందని, 1000 రోజుల్లో సాధించింది అరెస్టులు, అక్రమ నిర్బంధాలేనని విమర్శించారు. 420 హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ చేశారు.
మహిళల పట్ల గౌరవం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో నిన్న జరిగిన ఘటనపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్ రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారని పేర్కొంటూ ‘జై తెలంగాణ’ అంటూ తన పోస్టును ముగించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!