

రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనను ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు. నల్గొండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళన తన కల అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును పూర్తిచేసి కృష్ణా జలాలను నల్గొండకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిండి ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు రూ.83 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
గత 30 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి, లక్షలాది రేషన్ కార్డుల జారీ, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతుల కోసం భారీ వ్యయం, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, ఎస్సీ వర్గీకరణ, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు ఇవే నిదర్శనమని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!