
న్యూస్

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దావోస్‌కు వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించిన అనంతరం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు.
ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మరియు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!