
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొడంగల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అదేవిధంగా 430 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు, దౌల్తాబాద్ ఆలయ అభివృద్ధి పనులకు, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమాలకు కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!