
సినిమాలు

స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వేల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అట్టడుగు స్థాయిలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని మళ్లీ మళ్లీ సేకరించకుండా, అవసరమైన అదనపు సమాచారం కోసం మాత్రమే సర్వేలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఒకే విధమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని పదేపదే ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పరిపాలన సులభంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!