

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను “నా మిత్రుడు” అంటూ మరోసారి సంబోధించారు. తరచుగా ఇలా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే, కాని ఈసారి మరింత స్పష్టంగా చెప్పారు.
“నా మిత్రుడు నేను నిరంతరం ఒకే విధంగా ఆలోచిస్తున్నాం. ప్రజల కోసం, వారి మేలు కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరం కూడా పేదల కోసం చర్చిస్తాం. ప్రజల మంచి–చెడులపై నిరంతరం ఆలోచిస్తాం,” అని అన్నారు. పార్టీలు వేరు అయినా, ఆలోచనలు మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి దానినీ అమ్మేశారని, మద్యం పై 25 సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆయన విమర్శించారు. ఆ సమస్యలను సరిచేస్తూ, ప్రస్తుతం ప్రజల కోసం ఉపయోగకరమైన కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.
“పేదలు పేదలుగానే మిగలకూడదు. వారిని అభివృద్ధి చేయాలనే దిశగా నేను, నా మిత్రుడు చాలా ఆలోచనలు చేస్తున్నాం. దీనిలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పటివరకు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చాం. త్వరలోనే ఇవి గ్రౌండింగ్ కానున్నాయి. అవి లాభదాయకంగా మారి లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి,” అని సీఎం చంద్రబాబు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!