

టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో భాగంగా నిన్న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు విజయ్ను సుమారు 7 గంటల పాటు విచారించారు. ఆ విచారణ అనంతరం మరింత వివరాలు తెలుసుకునేందుకు మరోసారి పిలవాలని సీబీఐ నిర్ణయించినట్లు సమాచారం.
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సీబీఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లుగా సమాచారం. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, పరిస్థితి అదుపు తప్పడంతో తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయానని ఆయన వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తన రాజకీయ ఎదుగుదలను సహించలేక డీఎంకే ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కూడా విజయ్ విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!