

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ కార్ డ్రైవర్‌గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథ్ ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎదిగారు. చెన్నై జిల్లా విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శబరినాథ్, తమిళనాడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఈ కీలక పదవికి నియమించబడ్డారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఈ పరిణామానికి వేదికైంది.
శబరినాథ్కు పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా, వెంటనే చీఫ్ విప్‌గా నియమించడం విజయ్ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయంగా నిలిచింది. తనను నమ్మిన వారికి తగిన గుర్తింపు ఇస్తున్న నాయకుడిగా విజయ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ ఈ నిర్ణయానికి మంచి స్పందన లభిస్తోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం ద్వారా సమాన అవకాశాలపై విజయ్ తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!