
రాజకీయాలు

తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో అధికారం సాధించేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ప్రధాన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 937 మండలాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!