
క్రీడలు

అమెరికా పర్యటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఫార్మా సిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టులో డీవియేషన్ జరిగితే రైతుల భూములను తిరిగి ఇవ్వాలనే పార్లమెంట్ చట్టం ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో ఒకలా, ప్రజల ముందొకలా మాట్లాడుతోందని విమర్శించారు. లక్షలాది ఉద్యోగాల కోసం ప్రారంభించిన ఫార్మా సిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తుందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!