

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. ఒక పార్టీ అధికార దాహంతో, మరొక పార్టీ అవినీతి దాహంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోందని, బయటకు ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్లు కనిపించినా లోపల పరస్పర సహకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు.
నిరుద్యోగ యువత గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. యువతను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవద్దని సూచించారు. బీజేపీ ఎల్లప్పుడూ జాతీయవాదం, పారదర్శక రాజకీయాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గతంగా నేతలు కలుసుకోవడం సహజమేనని, ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్ సమావేశమవడాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!