
గాసిప్స్

బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ – శివసేన కూటమి ఘన విజయం సాధించింది. 227 సభ్యులతో కూడిన ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ సంస్థ అయిన బీఎంసీలో బీజేపీ తన ‘మిషన్ ముంబై’ లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చింది. కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ ఒంటరిగా 88 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఈ ఫలితాలతో ముంబై నగర పాలనపై బీజేపీ – శివసేన పట్టు మరింత బలపడింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో బీజేపీ ప్రభావం పెరుగుతున్నదానికి ఈ విజయం నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఎంసీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని చర్చ సాగుతోంది.
.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!