
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఆందోళన సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని రామచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!