

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల చికిత్స అనంతరం ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదయ్ పేరుతో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జూలై 27న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. అయితే అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు నిలిపివేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, కేసు దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా, షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగనుంది. జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!