
జనరల్

ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులను నిరసిస్తూ, విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.
విద్యార్థులపై పోలీసుల దాడులపై నిష్పాక్షిక విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని, అలాగే వీవీబీఎస్‌ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బంద్‌కు రాష్ట్రంలోని విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని కోరాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!