

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టులను నిరసిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ 'చలో లోక్ భవన్' ర్యాలీ నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు.
లోక్ భవన్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బలమూరి వెంకట్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి తదితర నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!