

వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చినట్టు కోర్టు పేర్కొంది.
జూన్ 17న బెంగళూరులోని SIT చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 226 రోజుల పాటు జైలులో ఉన్న భాస్కర్‌రెడ్డికి చివరకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం.
SIT తన అభియోగాల్లో పేర్కొన్నట్టు, డిస్టిలరీలు మరియు మద్యం సరఫరా కంపెనీల నుంచి అక్రమంగా కొల్లగొట్టిన సొమ్ములో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అందజేశారని వెల్లడించింది. ఆ నిధులను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నేరానికి సంబంధించిన “కర్త, కర్మ, క్రియ”గా అభియోగాలు నమోదు చేయగా, ఆయనను A-38 నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని A-39 నిందితుడిగా SIT జాబితాలో చేర్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!