

సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అమరావతిలోని అసెంబ్లీ చాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపడితే తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లిస్తానని బండ్ల గణేష్ ముందుగా సంకల్పం చేశారు. కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారు. అనంతరం బండ్ల గణేష్ జనవరి 19 న షాద్‌నగర్ నుంచి ‘సంకల్ప యాత్ర’ ప్రారంభించి, 23 రోజుల పాటు 535 కి.మీ పాదయాత్ర చేసి ఈ నెల 10 న తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించిన అనంతరం, అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి శ్రీవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బండ్ల గణేష్‌ను ఆత్మీయంగా పలకరించి పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచారని, వారి ప్రోత్సాహంతో యాత్ర విజయవంతంగా పూర్తిచేశానని బండ్ల గణేష్ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!