
జనరల్

కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికాయి. బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి భగీరథ్ ఎపిసోడ్ తర్వాత ఆయన తొలిసారిగా రాష్ట్ర కార్యాలయానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. “నేను ఏంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన నాకు రాదు” అని స్పష్టం చేశారు. సమాచారం అందిన వెంటనే తన కన్న కొడుకును కూడా పోలీసులకు అప్పగించిన చరిత్ర తనదేనని పేర్కొన్నారు. తెలంగాణలో గడీల పాలనను కూల్చింది బీజేపీయేనని చెప్పిన ఆయన, KTR ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!