
జనరల్

బండిభగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి దాఖలైన బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భగీరథ్ రేపు విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఈమెయిల్ పంపినట్లు సమాచారం వెలువడగా, తమకు అలాంటి మెయిల్ అందలేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, సైబరాబాద్పోలీసులు మరోసారి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే కరీంనగర్ లోని ఆయన బంధువుకు కూడా నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!