

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మరోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన తీవ్ర వ్యాఖ్యలతో హైలైట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూ ఆయన పరోక్షంగా “సైకో” అని సంబోధించారు. జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, వ్యాఖ్యలు ఆయన్నే ఉద్దేశించాయని స్పష్టమైంది.బాలకృష్ణకి దూకుడు ప్రసంగశైలి కొత్త కాదు. అయితే అసెంబ్లీలో ఇలాంటి పదజాలం వాడటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, “సైకో” వంటి పదాలు తాత్కాలిక హంగామా తెచ్చినా, సభ గౌరవాన్ని దెబ్బతీస్తాయి.ఇక చరణ్జీవి పేరును కూడా ఈ సందర్భంలో ప్రస్తావించడం వివాదాన్ని మరింత పెంచింది. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, టీడీపీ–జనసేన కూటమిలో కీలక పాత్రలో ఉండటంతో, ఇటువంటి వ్యాఖ్యలు కూటమి లోపల అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది.
రాజకీయ వాగ్వాదాల్లో కఠినమైన మాటలు సహజమే కానీ, వ్యక్తిగత విమర్శలు, సినిమా రిఫరెన్స్‌లు అసెంబ్లీలో ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు బాలకృష్ణనే “అసలు సైకో”గా ఎద్దేవా చేస్తున్నారు.ఈ వాగ్వాదం ఎన్డీఏ కూటమిలోని టీడీపీ–జనసేన బంధాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. కానీ ఒకే ఒక్క మాటతో, బాలకృష్ణ మరోసారి ఆంధ్ర రాజకీయాలను హీటెక్కించారు అనేది వాస్తవం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!