

తనపై దాడి జరిగిందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లామని, ముందుగానే ఈ విషయాన్ని సీఐ, ఎస్ఐలకు తెలియజేశామని చెప్పారు. అయినప్పటికీ బీటెక్ రవి ఆధ్వర్యంలో దాడులు జరిగాయని ఆరోపించారు. పెట్రోల్ బాంబులతో దాడికి ప్రయత్నించారని, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలుకు వెళ్తున్న తమను, అభ్యర్థులను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు.
తమపై దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అవినాష్ రెడ్డి విమర్శించారు. బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? పోలీసుల వ్యవహారశైలి ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!