

వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్టుల్లో జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మరణించిన కేసులో తన కుమారుడిని రక్షించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలతో సీదిరి అప్పలరాజును పోలీసులు ఏ3గా చేర్చారు. మరో వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్పలరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు, రూ.4 కోట్ల విలువైన భూమి అక్రమాల కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు నిందితులుగా చేర్చారు. కేసు నమోదైన అనంతరం వారు విచారణకు అందుబాటులో లేరని సమాచారం. ఈ నేపథ్యంలో అరెస్టుల్లో ఆలస్యం ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ విచారణకు హాజరుకాగా, ఆమెపై శాఖాపరమైన విచారణ నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!