
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపింది. త్వరలోనే స్థానిక ఎన్నికలను నిర్వహించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు నివేదించారు.
సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన డేటాను ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు గ్రామసభల ముందు ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేయనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!