

యువ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులు విస్తృత చర్చకు దారితీశాయి. తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమ వ్యవహారం ముగిసిందని, ఆ బాధతోనే ఆమె భావోద్వేగ పోస్టులు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనుపమ వాటిని తీవ్రంగా ఖండించారు.
"నా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏమి పోస్ట్ చేయాలనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నా జీవితంలో జరిగే మార్పుల గురించి మాట్లాడాను అంతే. నా పర్సనల్ లైఫ్ గురించి బయట ఉన్న మీకు ఏమి తెలుసు?" అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో ఆమె ప్రస్తుతం దర్శకుడు బద్రప్ప తెరకెక్కిస్తున్న 'క్రేజీ కల్యాణం' చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!