
సినిమాలు

చెన్నైలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ టీవీకే ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడే కొత్త పథకాలు ఏవీ లేవని, పాత పథకాలకు మేకప్ వేసి కొత్తవిగా చూపిస్తున్నారని ఆరోపించారు. డీఎంకే అమలు చేసిన పథకాలకు కేవలం 'వెట్టి' అనే పేరు జోడించి కొత్త స్కీమ్‌లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే బడ్జెట్‌లో మేకెదాటు ప్రాజెక్టు గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. తన అరెస్ట్ కూడా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు చేపట్టిన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే అని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!