

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బీహార్‌కి వెళ్లనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరగనున్న నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరికి అధికారిక ఆహ్వానం అందింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 14 న ప్రకటించిన ఫలితాల్లో ఎన్డీయే మరోసారి మెజారిటీ సాధించింది. దీంతో జేడీయు అధినేత నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పాట్నాలో వేగంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు హాజరుకానున్నారు. ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకోనున్న నేపథ్యంలో పాట్నాలో భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేశ్ ఎన్డీయే తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. తరువాత స్థానిక పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!