

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వీకే శశికళ రామనాథపురంలో జరిగిన సభలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. త్వరలోనే పార్టీ పేరు, కార్యాచరణను వెల్లడిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణంపై తనపై తప్పుడు ప్రచారం చేశారని, “జయలలితను నేనే చంపాను” అంటూ దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అప్పట్లో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అన్నారు.
తనను పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపారని, అయినా వెనక్కి తగ్గకుండా మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని శశికళ తెలిపారు. తమిళనాడు ప్రజల కోసం, జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు ఈ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!