
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు మాజీ బీజేపీ నేత కె. అన్నామలై ప్రకటించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటుడు రజనీకాంత్ సలహాలు తీసుకున్నానని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక మార్పు లక్ష్యంగా తన కొత్త రాజకీయ ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు.
గత 18 నెలలుగా బీజేపీతో విభేదాలు కొనసాగాయని, అందుకే పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు అన్నామలై చెప్పారు. తాను భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తమిళ గుర్తింపును ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తానని, తన కొత్త పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!