
గాసిప్స్

గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు ఈ బెయిల్ లభించింది. ఇదే కేసులో అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు.
ఈ వ్యవహారంలో అంబటిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!