
న్యూస్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బీఎంసీలో ఎంఐఎం తొలిసారి విజయం సాధించి తన ఖాతాను తెరిచింది. ఇది పార్టీకి ముంబై నగర రాజకీయాల్లో కీలక మైలురాయిగా మారింది.
మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 89 సీట్లు గెలుచుకుని పట్టణ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటింది. ఛత్రపతి సంభాజీనగర్, మాలేగావ్ వంటి నగరాల్లో కీలక పాత్ర పోషిస్తూ ‘కింగ్‌మేకర్’ గా అవతరించింది. పలు ప్రాంతాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని అధిగమించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన విస్తరిస్తున్న పట్టు స్పష్టంగా కనిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!