
సినిమాలు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించిన పార్టీ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయనతో పాటు పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్, మీనాక్షి నటరాజన్, నీరజ్ డాంగి, ప్రవీణ్ చక్రవర్తి, ప్రణవ్ ఝా పేర్లను పార్టీ ప్రకటించింది.
ఇప్పటికే రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతున్న ఖర్గే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి అవకాశం లభించింది. కాగా తమిళనాడులో ఖాళీ అయిన స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంతో ప్రవీణ్ చక్రవర్తి బరిలో నిలిచారు. జూన్ 18న 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!