
రాజకీయాలు

తెలంగాణలో పార్టీ మరియు ప్రభుత్వం మధ్య సమన్వయం బలోపేతం చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని కాంగ్రెస్ అఖిల భారత కమిటీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. పార్టీ మరియు ప్రభుత్వం మధ్య సమర్థవంతమైన అనుసంధానం ఏర్పడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు మరియు మంత్రి దామోదర రాజా నర్సింహా, మంత్రి సీతక్క, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలు సమన్వయంతో సాగేందుకు ఈ కమిటీ పని చేయనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!